బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు కన్నుమూత - కరోనాతో అచ్యుతరావు కన్నుమూత న్యూస్

16:09 July 22
కరోనాతో అచ్యుతరావు కన్నుమూత
బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన... హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన అచ్యుతరావు.. బాల కార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు చేశారు. అనేక మంది బాలబాలికలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. దశాబ్దాలుగా చిన్న పిల్లల సమస్యలపై పోరాడారు. సీపీఐ అనుబంధ బాలల సంఘంలోనూ చురుగ్గా ఉండేవారు.
బాలల సంరక్షణ పోరాటాల్లో అచ్యుతరావుది కీలక పాత్రః సీపీఐ నారాయణ
అచ్యుతరావు మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతరావు కొవిడ్ రక్కసికి ఆహుతి అయిపోయాడన్నారు. బాలల ఉద్యమానికి చేసిన సేవలు మరువలేనివని నారాయణ గుర్తు చేసుకున్నారు. అచ్యుతరావు కుటుంబంతో దశాబ్దల అనుబంధముందని... వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.