విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్విహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నివాస్ హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రదర్శనలిచ్చారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో నిర్వహించిన నెహ్రూ జయంతి కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. స్వాతంత్య్ర భారత తొలి ప్రధానిగా దేశ నిర్మాణంలో పండిట్ జవాహర్లాల్ విశేష్ కృషి చేశారని అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.
CHILDREN DAY : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - children day celebrations at various places
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాలల దినోత్సవాన్ని (children day at various places in andhrapradesh) ఘనంగా నిర్వహంచారు. ఈ కార్యక్రమాలకు అధికారులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు