చిన్నారి 'కిడ్నాప్'.. విజయవాడలో మహిళపై అనుమానం! - సామాజిక మాధ్యమాలు
విజయవాడ నగరంలో చిన్నారిని కిడ్నాప్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు కలకలం రేపాయి. బస్సులో చిన్నారిని ఓ మహిళ తీసుకెళ్తుండటంతో ప్రయాణికులు ఆమెను ఆరా తీశారు. తర్వాత ఏం జరిగిందంటే!
విజయవాడలో చిన్నారిని కిడ్నాప్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు నగరవ్యాప్తంగా కలకలం రేపాయి. పటమట పీఎస్ పరిధిలో ఓ మహిళ తన కుమారుడుని బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆ మహిళను అనుమానించి వివరాలు అడిగారు. సరిగా సమాధానం చెప్పని కారణంగా.. పటమట పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని కిడ్నాప్ చేశారంటూ... సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలను పొందుపరిచారు. కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు ఆ మహిళను విచారించగా.. బాలుడి తల్లి అని తేలింది.