ఎమ్మెల్యేలకు స్టార్ హోటల్లో శిక్షణ తరగతులు పెట్టలేదు కాబట్టే తెదేపా సభ్యులు హాజరు కాలేదని భావిస్తున్నామని విజయవాడలో ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో విపక్షాలపట్ల తెదేపా వ్యవహరించిన తీరుపై సిగ్గుతో ఆ పార్టీ సభ్యులు శిక్షణకు గైర్హాజరయ్యారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 30 రోజులు మాత్రమే అయ్యిందన్నారు. వైఎస్సార్ పార్టీ ఎక్కడా దాడులకు పాల్పడిన ఉదంతాలు లేవని స్పష్టం చేశారు. భాజపా నేతలు వాస్తవాలు గుర్తించి మాట్లాడాలని కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అసెంబ్లీకి ఇచ్చిన వివరాలు తప్పుడు డాక్యుమెంట్లు అనే విషయాన్ని లోకేశ్ తెలుసుకోవాలని, ట్వీట్లు చేస్తే సరికాదని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.
"తెదేపా ఎమ్మెల్యేలు శిక్షణకు ఎందుకు రాలేదంటే..!?" - tdp
ఓరియంటేషన్ శిక్షణ తరగతులు స్టార్ హోటళ్లలో పెట్టలేదు కాబట్టే... తెదేపా శాసన సభ్యులు హాజరు కాలేదని ప్రభుత్వ ఛీప్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.
'శిక్షణా తరగతులు స్టార్ హోటళ్లలో లేవని గైర్హాజరు'