ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజలకు ఉపయోగపడే బిల్లుల్ని అడ్డుకుంటున్నారు' - గడికోట శ్రీకాంత్ రెడ్డి తాజా వార్తలు

శాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీలు నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లుల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

chief vip  gadikota srikanth reddo on tdp mlcs
గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

By

Published : Jun 18, 2020, 6:46 PM IST

ప్రజలకు ఉపయోగపడే బిల్లుల్ని అడ్డుకుని తెదేపా సభా సంప్రదాయాన్ని పాటించలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మండలిలో ఎమ్మెల్సీ లోకేశ్ ఫొటోలు తీయడం, యనమల రామకృష్ణుడు డిప్యూటీ ఛైర్మన్​కు స్లిప్పులు పంపడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నివాసంలో ఉంటే.. లోకేశ్ సభలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

'సభలో బలం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సౌమ్యుడైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పైనే దాడికి దిగారంటే వారి ఆలోచనా విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేం పెట్టినవన్నీ ప్రజలకు ఉపయోగపడే బిల్లులు. వాటిని అడ్డుకుంటున్నారు. '-- ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details