ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి... ప్రజలకేం చేస్తారు ? :జవహర్ - వివేకా హత్యకేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు.

జవహర్
జవహర్

By

Published : Mar 21, 2020, 5:01 AM IST

సొంత చెల్లెలికి న్యాయం చేయలేని దుస్థితిలో సీఎం జగన్‌ ఉన్నారని మాజీమంత్రి జవహర్‌ విమర్శించారు. వివేకా హత్య కేసులో సీబీఐకి సహకరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరన్నట్లుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంత వరకు నిందితుల్ని పట్టుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హత్య జరిగి ఏడాది గడిచినా.. నిందితుల్ని పట్టుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఆక్షేపనీయమన్నారు.

వైకాపా అధికారంలోకి రాగానే సిట్ అధికారి అమిత్ గార్గ్​ను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని జగన్ వేసిన పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు. వాస్తవాలు వెలుగులోకి వస్తే జగన్ పాత్ర ఏమిటో బయటపడుతుందనే హత్య కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details