ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అందులో భాగంగానే జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి'

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం దాడులు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. డీజీపీ గౌతమ్​ సవాంగ్​కు లేఖ రాసిన ఆయన...రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగిందని విమర్శించారు.

అందులో భాగంగానే జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి
అందులో భాగంగానే జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి

By

Published : Sep 27, 2020, 10:02 PM IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిప్డడారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్​ సవాంగ్​కు లేఖ రాసిన ఆయన...చిత్తూరు జిల్లాలో రామచంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాలపై దాడులకు పాల్పడటం హేయమని ఆక్షేపించారు. ఎస్సీలపై దాడుల్లో భాగంగానే జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరగిందని విమర్శించారు. వైకాపా ప్రోద్బలంతో కుట్రపూరితంగా దాడి జరిగిందని త్వరలోనే రుజువు అవుతోందని వ్యాఖ్యనించారు. వైకాపా చేస్తున్న ఈ దుర్మార్గ చర్యలన్నీ మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకే విఘాతమన్నారు.

మొగ్గలోనే వీటిని అణిచివేసే చర్యలు చేపట్టకపోవడమే దళితులపై రోజురోజుకూ ఈవిధమైన దాడులు పేట్రేగడానికి ప్రధాన కారణమని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దురాగతాలపై తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details