కేంద్ర విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ - చంద్రబాబు వార్తలు
Chandrababu letter to Foreign Minister Jai Shankar : కేంద్ర విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారిని స్వదేశానికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
Chandrababu letter to Foreign Minister Jai Shankar : ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, ప్రజలను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు... విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖరాశారు. యుద్ధం కారణంగా 4వేల మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారన్న చంద్రబాబు...పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు కూడా చిక్కుకున్నారని తెలిపారు. ఉక్రెయిన్ లోని కీవ్, ఒడెస్సా పట్టణాల్లో.. ఆహారం కూడా దొరక్క తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో స్వదేశానికి తెచ్చిన విధంగా..తెలుగు ప్రజలను ఉక్రెయిన్ నుంచి తీసుకురావాలని కోరారు.
ఇదీ చదవండి :ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు.. చాలా భయంగా ఉంది: ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు