Chandrababu Letter to CS: సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు - ap news
13:33 December 10
సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ
హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఆయన లేఖ రాశారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.
ఇదీ చదవండి
AP CID Raids: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు