CBN : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం సమావేశం అవుతారు. ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం తరపున తమ మద్దతు తెలపనున్నారు.
ముర్ముకు మద్దతు: ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు తెదేపా వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి తెదేపా కట్టుబడి ఉందన్నారు.