ప్రకృతి సహకరించి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండటాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఒక్క సంవత్సరం కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండలేదన్నారు. చంద్రబాబు కరవు నాయకుడని ప్రజలకు అర్థమైందన్నారు. కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు శ్రీశైలం నుంచి నీరు తరలించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారన్నారు. తన ఇంటిని ముంచేశారని బాబు వ్యాఖ్యానించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
'ప్రాజెక్టులు నిండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు' - anil
ప్రాజెక్టులు నిండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఒక్క ఏడాది కూడా జలాశయాలు నిండలేదన్నారు.
అనిల్ కుమార్