'వైకాపా పాలనలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది' - environment day latest news in ap
గత ఏడాది పాలనలో పర్యావరణ విధ్వంసం కొనసాగిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా గళం విప్పి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియచేద్దామంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
గతేడాది పాలనలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది
గత ఏడాది పాలనలో పర్యావరణ పరిరక్షణ చర్యలు నిలిచిపోవడమే కాకుండా పర్యావరణ విధ్వంసం కొనసాగిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా... మన గళం విప్పి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియచేద్దామని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.