జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. మనవడు దేవాన్ష్‌తో కలిసి పుస్తకం చదువుతున్న వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘దేవాన్ష్ పుస్తకం చదువుతూ.. 'జనతా కర్ఫ్యూను ప్రజలు ఎలా పాటిస్తున్నారో గమనిస్తున్నా. ఇది మన భద్రత కోసం.. ఇవాళ ఇళ్లలోనే ఉందాం. కుటుంబంతో కలిసి సమయం గడపండి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
మనవడితో చంద్రబాబు ఏం చెబుతున్నారంటే? - కరోనాపై చంద్రబాబు కామెంట్స్ న్యూస్
కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు ప్రధాని మోదీ విధించిన జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన తన ఇంటికే పరిమితమై కుటుంబంతో సమయం గడుపుతున్నారు.
మనవడితో చంద్రబాబు ఏం చెబుతున్నారంటే?