ఒక ఎంపీ అన్న గౌరవం కూడా లేకుండా తెదేపా నేత గల్లా జయదేవ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు అన్యాయం జరుగుతుంటే మద్దతుగా నిలవడం తప్పా. మీలా నమ్మిన ప్రజలను మోసం చేసే చరిత్రహీనులం కాదు. ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజల కోసం నిలబడతాం. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేంత తప్పు జయదేవ్ ఏం చేశారు? ఆయనపై పెట్టిన అక్రమ కేసుల్ని పోలీసులు వెనక్కి తీసుకోవాలి. ఎంపీ జయదేవ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జయదేవ్‌ను వెంటనే విడుదలచేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
- చంద్రబాబు, తెదేపా అధినేత
గల్లా జయదేవ్ చేసిన తప్పేంటి?: చంద్రబాబు - గల్లా జయదేవ్ అరెస్టు న్యూస్
తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అరెస్టుపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దుతుగా నిలవడం తప్పా అని ట్వీట్ చేశారు.
జయదేవ్ చేసిన తప్పేంటి: చంద్రబాబు
ఇదీ చదవండి: గుంటూరు సబ్ జైలుకు గల్లా జయదేవ్