పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు. అనంతరం తెలంగాణలో భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితుల చెంతకు వెళతారు. తొలిరోజు పర్యటన తర్వాత చంద్రబాబు భద్రాచలంలో బస చేయనున్నారు. శుక్రవారం ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.
పోలవరం విలీన మండలాల్లో నేటి నుంచి చంద్రబాబు పర్యటన - నేటి నుంచి పోలవరం వీలిన మండలాల్లో చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత చంద్రబాబు పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు.
పోలవరం వీలిన మండలాల్లో నేటి నుంచి చంద్రబాబు పర్యటన
TAGGED:
చంద్రబాబు వార్తలు