Chandrababu: ముఖ్యమంత్రి ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 'కల్తీ సారా అరికట్టాలి జె. బ్రాండ్స్ మద్యం నిషేధించాలి' అనే డిమాండ్‌తో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ.. గ్రామ స్థాయి నేతలు, క్యాడర్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..: చంద్రబాబు - chandrababu on agitations over natu sara and wine
Chandrababu Teleconference: తెలుగుదేశం ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ సారా, జె- బ్రాండ్స్ మద్యానికి వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్.., సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని మండిపడ్డారు. జగన్ తెచ్చిన కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆరోపించారు. మద్యం ద్వారా ఏడాదికి ప్రజల జేబుల నుంచి 5 వేల కోట్లు కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మద్యం ద్వారానే... కమిషన్ల రూపంలో 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:వీవోఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదు.. వైకాపా నేత చేసిన హత్య: లోకేశ్