ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: నరేగా బిల్లులు రాకుంటే మా దృష్టికి తీసుకురండి: చంద్రబాబు

రాష్ట్రంలో ఎవరికైనా నరేగా(National Rural Employment Guarantee Scheme) బిల్లులు రాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) సూచించారు. ప్రభుత్వం వడ్డీతో సహా చివరి పైసా చెల్లించే వరకు కృషి చేస్తామన్నారు.

Chandrababu
Chandrababu

By

Published : Sep 23, 2021, 8:48 PM IST

Updated : Sep 24, 2021, 2:07 AM IST

రాష్ట్రంలో ఎవరికైనా నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) బిల్లులు రాకుంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నరేగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఆయన ప్రారంభించారు. బాధితులకు ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించేలా ఈ విభాగం కృషి చేస్తుందని చంద్రబాబు వివరించారు.

కుట్ర పూరితంగా వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన నరేగా బిల్లులపై కోర్టు మొట్టికాయలు తిన్నా బుద్ధిరాలేదని మండిపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పలు చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో బిల్లులు నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల సమస్యలు పరిష్కారం కాని వారు 9393540999, 9676088463, 9440990479 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వ కార్యాచరణ

Last Updated : Sep 24, 2021, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details