ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరింత దూకుడుగా.. ప్రజాసమస్యలపై పోరాడండి: చంద్రబాబు - chandrababu on mahanadu success

Chandrababu News: ఒంగోలులో నిర్వహించిన మహానాడు ప్రజావిజయంగా తెదేపా అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. "క్విట్ జగన్- సేవ్ అంధ్రప్రదేశ్" నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Chandrababu Strategy Committee meeting
చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం

By

Published : May 30, 2022, 7:46 PM IST

Updated : May 30, 2022, 8:22 PM IST

CBN Fires on CM Jagan: ఇక విరామం లేకుండా మరింత దూకుడుగా ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని తెలుగుదేశం నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశాన్ని ఆన్​లైన్​లో నిర్వహించారు. ఒంగోలు మహానాడు ప్రజా విజయంగా చంద్రబాబు అభివర్ణించారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయ్యిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్​కు మహానాడుతో భరోసా వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్.. రాజకీయాలకే అనర్హుడని చంద్రాబాబు ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. నెలకు రెండు జిల్లాల్లో పర్యటిస్తానని అధినేత వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై "బాదుడే బాదుడు" కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 'క్విట్ జగన్- సేవ్ అంధ్రప్రదేశ్' నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహానాడు విజయవంతంలో భాగస్వాములు అయిన నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా నేతల పనితీరుకు చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. మహానాడు సక్సెస్​ను పార్టీ క్యాడర్​తోపాటు ప్రజలూ ఆస్వాదిస్తున్నారని ఈ సందర్భంగా అధినేత దృష్టికి తీసుకెళ్లారు నేతలు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని వెల్లడించారు.

అధికారులు - వైకాపా నేతల అక్రమ మైనింగ్‌ దందా :కుప్పంలో అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీలో విచారణ జరుగుతున్నప్పటికీ.. అక్రమాలు ఆగలేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. వైకాపా నేతలతో అధికారులు కుమ్మక్కై మైనింగ్‌ అక్రమాలకు సహకరిస్తున్నారన్నారని మండి పడ్డారు. ఈ మేరకు అక్రమ మైనింగ్‌పై సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని, తనిఖీలు పెంచి అరికట్టేలా చూడాలని, గుడిపల్లె మం.గుతర్లపల్లిలో కొనసాగతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : May 30, 2022, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details