Chandrababu angry on ysrcp government: ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పలాయనవాదమెందుకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
CBN: ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. పలాయనవాదమెందుకు? : చంద్రబాబు - chandrababu latest news
15:05 February 14
పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు..
కేంద్ర హోంశాఖ అజెండాలో హోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైకాపా నేతలు ఇప్పుడు తెదేపాపై బురద చల్లడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా.. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకంటే దారుణంగా ఏపీని దిగజార్చారని ఆగ్రహ వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారు..
Chandrababu comments on the film industry : లేని సమస్యను సృష్టించి జగన్ సినిమా హీరోలను ఘోరంగా అవమానించారన్న చంద్రబాబు.. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్ను ప్రాధేయపడలా అని ఆక్షేపించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారని దుయ్యబట్టారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చెయ్యడమే నాడు-నేడు పథకమని విమర్శించారు. పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైకాపా అవినీతిపై తెదేపా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోయినా.. అధిక బిల్లులు వస్తుండటాన్ని తప్పుపట్టారు. విశాఖ ఉక్కుపై ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపును ప్రభుత్వం నిలిపివేయ్యాలన్నారు.
ఇదీ చదవండి