Chandrababu: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రోజుల జిల్లాల పర్యటనలో.. ప్రజా సమస్యలు, ప్రజల అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతకు.. అద్ధం పట్టాయని చెప్పారు. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో.. ప్రజలు మార్పు కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందన్నారు. తెలుగు తమ్ముళ్లలో కసి.. ప్రజల్లో తెలుగు దేశం పార్టీ పై ఆసక్తి.. రాబోయే మార్పును సూచిస్తున్నాయని చెప్పారు. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తల, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన పర్యటనలకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందని.. చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: