CBN on badhude badhudu:విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. ఈ నెలాఖరు వరకూ తెదేపా పిలుపునిచ్చిన 'బాదుడే బాదుడు' కార్యక్రమం విషయంలో.. ప్రతి ఇంచార్జ్, శ్రేణులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. పార్టీ అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వహణలో ఎవరికీ మినహాయింపులు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త, ప్రతి నేతా కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. త్వరలోనే తానూ, లోకేశ్, అచ్చెన్నాయుడు వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంపై చంద్రబాబు ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు.
కరెంటు తీస్తున్న జగన్ను.. జనం తీసేయబోతున్నారు : చంద్రబాబు - 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలన్న చంద్రబాబు
CBN on badhude badhudu:విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. ఈ నెలాఖరు వరకూ తెదేపా పిలుపునిచ్చిన 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని.. ప్రతి ఇంచార్జ్, శ్రేణులు సీరియస్గా తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో ఎవరికీ మినహాయింపులు లేవని.. ప్రతి కార్యకర్త, ప్రతి నేతా కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
![కరెంటు తీస్తున్న జగన్ను.. జనం తీసేయబోతున్నారు : చంద్రబాబు chandrababu review meeting on TDP badhude badhudu programme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14971799-829-14971799-1649492334215.jpg)
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం జరుగుతున్న తీరుపై ఆయన సమీక్షించారు. క్యాడర్ ప్రతి ఇంటికీ వెళ్లి క్యాండిల్, అగ్గిపెట్టె, బాదుడే బాదుడు కరపత్రం పంపిణీ చేస్తుంది. గ్రామాల్లో కరెంట్ తీస్తున్న జగన్ ను.. సీఎం పదవి నుంచి తీసేసేందుకు జనం సిద్దంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ చార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధి పోతుందని, పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:Power cuts in hospitals: అంధకారంలో ఆస్పత్రులు...చీకట్లో ప్రసవ వేదన