Konaseema incident: కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఘర్షణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెదేపాపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సున్నిత అంశంలో హోంశాఖ మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా సహకరించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
కోనసీమ ఘటన.. ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే: చంద్రబాబు - తెదేపా అధినేత చంద్రబాబు
Chandrababu on Amalapuram Incident: అమలాపురంలో చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమన్న చంద్రబాబు.. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
CBN on konaseema incident
Last Updated : May 24, 2022, 9:57 PM IST