వైకాపా ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు సూపర్ సెటైర్ - ysrcp
పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ తీరుపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు.
అధికారంలోకి వచ్చాం కదా... ఏదో కాస్త హడావుడి చేద్దామనుకుంటే తప్పులేదు కానీ... ఇల్లు పీకి పందిరేద్దామనే ఆలోచన చేయకూడదు.. అంటూ జగన్ సర్కార్కు హితవు పలికారు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ''తెలియనప్పుడు ఎవరైనా చెబితే వినాలి కానీ... వినరుగా'' అంటూ ట్విటర్ లో ఎద్దేవా చేశారు. చివరికి పోలవరం అథారిటీ కూడా ఇదే చెప్పిందన్న చంద్రబాబు.... ఇప్పటికైనా మేథావులకి తలకెక్కుతుందో లేదో అంటూ కామెంట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.