ఏడాది పాలనలో బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా... గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని సైతం వైకాపా ప్రభుత్వం అవమానించిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మండలి చైర్మన్ షరీఫ్, డాక్టర్ సుధాకర్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు.
వైకాపా ఏడాది పాలనపై మరో వీడియో రిలీజ్ చేసిన చంద్రబాబు - వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన వీడియో
వైకాపా ఏడాది పాలనలో బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా... గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని అవమానించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 'చేతకాని పాలన, అందరికీ వేదన' పేరిట ఆయన మరో వీడియోను విడుదల చేశారు.
'చేతకాని పాలన, అందరికీ వేదన' పేరిట మరో వీడియోను ఆయన విడుదల చేశారు. చేతకాక కొంత, మోసపూరిత మనస్తత్వంతో కొంత, మొండితనంతో మరికొంత... వైకాపా ఏడాది పాలన అందరికీ వేదననే మిగిల్చిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అందరూ భవిష్యత్తుపై బెంగతో ఉన్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, రైతులు, మహిళలు, యువత... ఇలా అన్నివర్గాల వారినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు పోగొట్టుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.