ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి' - నివర్ తుపాను నష్టంపై చంద్రబాబు కామెంట్స్

ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాకుండా.. రైతు కన్నీరు తుడిచి వెంటనే పరిహారం అందించి.. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.

'గాలిలో తిరిగి.. గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి'
'గాలిలో తిరిగి.. గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి'

By

Published : Dec 9, 2020, 4:53 PM IST

రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుకు సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదని.. పంట బీమా ప్రీమియం కట్టకపోగా తుపానొస్తే కనీసం పంటనష్టం అంచనా వేసే దిక్కుకూడా లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో వీటిపై నిలదీస్తే సస్పెండ్ చేశారని తెదేపా అధినేత ధ్వజమెత్తారు. నివర్ తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన వివిధ ప్రాంతాల రైతుల ఆవేదనకు సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్విట్టర్​లో పోస్టు చేశారు.

'గాలిలో తిరిగి.. గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి'

ABOUT THE AUTHOR

...view details