ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధోనికి చంద్రబాబు, లోకేష్​ శుభాకాంక్షలు - chandrababu latest news

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిటైర్​మెంట్ పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడని కొనియాడారు.

మహేంద్రసింగ్ ధోని రిటైర్​మెంట్ పై స్పందించిన తెదేపా అధినేత
మహేంద్రసింగ్ ధోని రిటైర్​మెంట్ పై స్పందించిన తెదేపా అధినేత

By

Published : Aug 16, 2020, 11:13 AM IST

మహేంద్రసింగ్ ధోని రిటైర్​మెంట్ పై స్పందించిన తెదేపా అధినేత

జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ధోనికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్​కి ధోని చేసిన ఎనలేని కృషి మరువలేనిదన్నారు. ఇకముందు మహేంద్రుడు లేని ఆటను చూడడం కాస్త వెలితిగానే ఉంటుందన్నారు. అత్యుత్తమమైన ఆటతీరుతో భారతదేశాన్ని గర్వించేలా చేశారని చంద్రబాబు కొనియాడారు. చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత విజయాలు ధోని అందించారని లోకేష్ పేర్కొన్నారు. ధోని అందరినీ గర్వ పడేలా చేశారని, జీవితంలో ప్రారంభించబోయే సెకండ్ ఇన్నింగ్స్ కు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు

ఇదీ చదవండి:హెలికాప్టర్‌ గమనం.. భారత క్రికెట్‌లో సంచలనం

ABOUT THE AUTHOR

...view details