కరోనా బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలంటూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో 'సాధన దీక్ష' పేరిట నిరసన కార్యక్రమం జరగనుంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వటంతో పాటు కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 10లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన బాధిత కుటుంబాలకు 25 లక్షలు.. ఫ్రంట్లైన్ వారియర్ కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. చంద్రబాబుతో పాటు 175 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిరసనలు కొనసాగించనున్నారు. కరోనా కొనసాగినంతకాలం పేదలకు నెలకు రూ. 7,500 అందించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
"అధినేత చంద్రబాబుతో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు ఎన్టీఆర్ భవన్‌లో జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారు. అదే సమయంలో 175 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు నిరసనలు చేపడతారు."- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
కోవిడ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఈనెల 16 నుంచి తెలుగుదేశం ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో.. తెదేపా నేతలు, శ్రేణులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా.. 'సాధన దీక్ష' పేరిట ప్రత్యక్ష నిరసనలకు దిగారు.
అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ప్రజలెలా ఉంటారు..?