తెదేపా అధికార ప్రతినిధి పట్టాభికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు ఫోన్ చేసి కారు ధ్వంసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
ఈ ఘటన ఆటవిక రాజ్యం కాక మరేంటని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిన్న సబ్బాం హరి నివాసం, ఇవాళ పట్టాభి కారుపై దాడి సిగ్గుచేటన్న లోకేశ్.. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.