ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిటాల రవి అంటే సామాన్యుడికి ఒక భరోసా: చంద్రబాబు - పరిటాల రవి వర్ధంతి వార్తలు

పరిటాల రవి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఏ అండా లేని సామాన్యుడికి ఒక భరోసా అని.. తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. నేడు రవీంద్ర వర్ధంతి సందర్బంగా నివాళులర్పించారు.

chandrababu pays tribute to tdp leader paritala ravi on occassion of his death anniversary
పరిటాల రవి వర్థంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాళులు

By

Published : Jan 24, 2021, 1:08 PM IST

పరిటాల రవి వర్థంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాళులు

తెదేపా దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్బంగా.. పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పరిటాల రవి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఏ అండా లేని సామాన్యుడికి.. ఒక భరోసా అన్నట్టుగా జీవించారని కొనియాడారు.

జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరు సాగించిన చరితార్థుడని తెలిపారు. 'పీడిత వర్గాల గుండెచప్పుడు దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది స్మృతికి నివాళులు' అంటూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details