Chandrababu Participate In Semi Xmas celebrations: శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెప్తుంటే..సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైకాపా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభు ఆమోదిస్తారా ? అని ఆయన నిలదీశారు. ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపివేసిన ఏకైక ప్రభుత్వం వైకాపానే అని మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో ఇప్పుడు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలుగుదేశం ఉన్నంత వరకూ మతసామరస్యాన్ని కాపాడతామన్న చంద్రబాబు.., చర్చిలకు తొలిసారి ఆర్ధిక సాయం చేయటంతో పాటు పెళ్లి కానుక, జెరూసలేం యాత్రకు నిధులు, క్రిస్మస్ కానుక లాంటి ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. వైకాపా మత సామరస్యాన్ని కాలరాస్తోందన్న చంద్రబాబు..ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలకు శ్రీకారం చుట్టింది తమ పార్టీనేని స్పష్టం చేశారు.
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి..