వైకాపా నేతలు అరాచకాలు చేస్తున్నట్లు తానూ తెలుగుదేశం శ్రేణులను వదిలిపెడితే ఆపార్టీ నేతలు రోడ్డెక్కలేరని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ మారాలని హితవు పలికారు. తప్పుడు పనులకు అండగా నిలిచిన పోలీసులను మాత్రమే తాను తప్పు పడుతున్నానని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అలా అయ్యింటే తానిప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడిని కాదన్నారు.
'మీరొదిలినట్లు నేనూ వదిలేస్తే బయటకు రాలేరు' - మహానాడు కార్యక్రమం తాజా వార్తలు
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మారాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా అరాచకాలు చేస్తున్నట్లు తాము కూడా చేస్తే ఆ పార్టీ నేతలెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని హితవు పలికారు.
మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు
తాము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎక్కువ సమయం పట్టదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాజకీయాలంటే తమాషా కాదని... అరాచకాలు చేస్తే ఆటలు సాగవని జగన్ గుర్తించాలన్నారు. డీజీపీ ప్రభుత్వానికి లొంగిపోయారనడానికి రంగనాయకమ్మ ఘటన ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి.. మూతపడ్డ ఎన్టీఆర్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ... స్పేర్ పార్ట్స్ మార్కెట్ కుదేలు
Last Updated : May 28, 2020, 5:07 PM IST