మౌలానా జయంతి రోజున మైనారిటీల హక్కుల సంరంక్షణ కోసం, ఆశయాల సాధనకు పునరంకితమవుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జాతీయోద్యమ కాలంలోనే మతతత్వాన్ని వ్యతిరేకించి, లౌకికవాద ఆవశ్యకతను చాటి చెప్పిన జాతీయోద్యమ నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. భారతదేశ తొలి విద్యా మంత్రిగా సాహిత్యం, విద్యా వికాసాల కోసం కృషి చేసిన అబుల్ కలాం రాజ్యాంగ రచనలోనూ పాలు పంచుకున్నారన్న చంద్రబాబు ప్రజలందరికీ స్వేచ్ఛాయుత జీవనం, ధన, మాన, ప్రాణ సంరక్షణ సాధించినప్పుడే ఆజాద్ ఆశయాలకు సాఫల్యత అని స్పష్టం చేశారు.
అలాంటి రోజు వచ్చినప్పుడే మౌలానా ఆశయాలకు సాఫల్యత: చంద్రబాబు - ఏపీలో మైనారిటీలపై దాడులు న్యూస్
మైనారిటీలపై వివక్షత, అణచివేత లేని రాజ్యంగా మన సమాజం ఉండాలనేది మౌలానా సహా రాజ్యాంగ నిర్మాతలందరి ఆకాంక్ష అని చంద్రబాబు గుర్తు చేశారు. మన రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు చూస్తుంటే బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
chandrababu on moulana abul kalam birth anniversary