ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ దిల్లీ వెళ్లింది.. కేసుల మాఫీ కోసమా?: చంద్రబాబు

జగన్ దిల్లీ వెళ్లింది తన కేసుల మాఫీ కోసమా? రాష్ట్ర ప్రయోజనాల కోసమా? అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. పదిసార్లు దిల్లీ వెళ్లి రాష్ట్రానికి జగన్ ఒరగబెట్టిందేంటని ఆయన ప్రశ్నించారు.

జగన్​ దిల్లీ వెళ్లింది.. కేసుల మాపీ కోసమా?: చంద్రబాబు
జగన్​ దిల్లీ వెళ్లింది.. కేసుల మాపీ కోసమా?: చంద్రబాబు

By

Published : Dec 16, 2020, 4:19 PM IST

విశాఖ రైల్వే జోన్​కు నిధులు, కడప స్టీల్ ప్లాంట్, విసీఐసీ, బిసీఐసీ ఏమయ్యాయో.. పెట్రోలియం కాంప్లెక్స్, తొలి ఏడాది ఆర్థిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమైనా అడిగారా? అని జగన్​ను చంద్రబాబు నిలదీశారు. అప్పుడు మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజేం చెప్పారు? ఈ రోజేం చేస్తున్నారని ఆక్షేపించారు.

వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలనే మరో జగన్నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 25నుంచి కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ అంటూ దొంగ ట్వీట్లు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓటమి ఎదురవుతుందనే.. వ్యాక్సిన్ పంపిణీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. స్థానిక ఎన్నికలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైకాపా దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఇదీ చదవండి:నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?

ABOUT THE AUTHOR

...view details