కోటేశ్వరమ్మకు చంద్రబాబు నివాళులు
మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
విజయవాడ లబ్బీపేటలో మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ భౌతికకాయానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు నివాళులర్పించారు.కోటేశ్వరమ్మ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయిలో ఎదిగారని చంద్రబాబు అన్నారు. చదువుల తల్లిగా పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారని.. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నెలకొల్పిన కోటేశ్వరమ్మ..మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. తానంటే చాలా అభిమానం చూపించేవారని... తనను ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.