తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్ కాగిత వెంకట్రావు మృతి.. పార్టీకి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.
ఇదీ చదవండి:'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'
బీసీల అభ్యున్నతికి వెంకట్రావు ఎంతో కృషిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన సేవలు చిరస్మరణీయమని లోకేష్ కొనియాడారు. తెదేపాకు వెన్నెముకలా నిలిచిన వెనకబడిన తరగతులకు చెందిన నేత అని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి:పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గుండెపోటుతో మృతి