CBN on NTR oath day : నందమూరి తారక రామారావు తొలిసారిగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నేటికి 39 ఏళ్ళైంది. ఈ సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు ఘనంగా నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చాటి చెప్పిన రోజు ఇదేనని కొనియాడారు.
CBN on NTR oath day : ఆ ఘనత సాధించిన.. ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు - ఎన్టీఆర్ పై చంద్రబాబు ట్వీట్లు
CBN on NTR oath day : ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి నేటికి 39 ఏళ్ళైంది. ఈ సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు ఆయనకు జోహార్లు అర్పించారు.
![CBN on NTR oath day : ఆ ఘనత సాధించిన.. ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు CBN on NTR oath day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14141659-560-14141659-1641737961197.jpg)
ఎన్టీఆర్ కు జోహార్లంటూ చంద్రబాబు ట్వీట్.
తెలుగు ప్రజల కీర్తిని పెంచి, బడుగుల జీవితాలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజు ఇదేనన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు.. ఆయనకు జోహార్లు అంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి : పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది.. ఎన్టీఆర్ : తెదేపా నేతలు