తెదేపా కార్యాలయంపై దాడులు చేసిన వారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మీరు చర్యలు తీసుకోనంత మాత్రాన మేం భయపడేది లేదని తెలిపారు. చర్యలు తీసుకునే రోజు ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇష్టానుసారం అప్పులు చేస్తూ అకౌంట్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
tdp office attack:దాడులు చేసిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు:చంద్రబాబు - చంద్రబాబు నాయుడు
తెదేపా కార్యాలయంపై దాడులు చేసిన వారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మీరు చర్యలు తీసుకోనంత మాత్రాన మేం భయపడేది లేదని తెలిపారు.
చంద్రబాబు నాయుడు
ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తేవటం సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు. రేపోమాపో ప్రైవేటు ఆస్తుల్ని తాకట్టు పెడతారా అని నిలదీశారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం విశాఖ, విజయవాడల్లో లిక్కర్ కారణంగా మరణాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకాపాకి చెందిన చాలా మంది చరిత్రలు.. క్యారెక్టర్ల గురించి చాలా చెప్పొచ్చు.. సభ్యత అడ్డొస్తోందని అన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: