స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు, స్వతంత్ర భారతావని ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహానుభావుని సేవలను మనసారా స్మరించుకుంటున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
విశాఖ మన్యం నుంచి మహోగ్రరూపంలా గర్జించి.. భారతీయుని సత్తా ఏంటో చూపిన వీరుడని బాబు కొనియాడారు. వందేమాతరం అంటూ.. సాయుధ పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించి స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుని త్యాగం అనిర్వచనీయమని అన్నారు. తెలుగుదేశం హయాంలో సీతారామరాజు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి నివాళులర్పించినట్లు గుర్తు చేశారు.