ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cbn on illegal mining: ఎలుగు బంట్లను తొక్కించి చంపిన విషయం బాధించింది: చంద్రబాబు - chandrababu hot comments on kondaplli illegal mining

సరంక అటవీ ప్రాంతంలో అమానవీయ చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ మైనింగ్‌ మాఫియా.. భారీ వాహనాలతో ఎలుగుబంట్లను తొక్కి చంపిందనే విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని చంద్రబాబు ట్వీట్​ చేశారు.

chandrababu on illegal mining
జగన్ రెడ్డి మైనింగ్ మాఫియాపై చంద్రబాబా ఫైర్

By

Published : Aug 1, 2021, 3:14 AM IST

సీఎం జగన్‌ మైనింగ్‌ మాఫియా..భారీ వాహనాలతో రెండు ఎలుగుబంట్లను తొక్కి చంపిందనే విషయం తెలుసుకొని ఎెంతో బాధపడ్డానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చంపిన ఎలుగుబంట్లను బామిడికా గ్రామంలోని పొదల్లో పడేశారన్న ఆయన ఈ ఘటనపై మండిపడ్డారు. సరంక అటవీ ప్రాంతంలో లాటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలు చేపడుతూ.. ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ట్వీట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో అమానవీయ చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

భారీ వాహనాలు అడవి జంతువులను తొక్కి చంపిన ఘటనలు అనేకం చూశామని స్థానికులు ఆరోపించిన విషయాన్ని ట్వీట్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. ప్రభుత్వం, మాఫియా.. వాస్తవాలను కప్పిపుచ్చుతున్నాయని పేర్కొన్నారు. అడవి జంతుజాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఎలుగుబంట్ల హత్య ఘటనకు సంబంధించిన ఫోటోలను తన ట్వీట్​కు జత చేశారు.

ABOUT THE AUTHOR

...view details