కృష్ణా జిల్లాలో ఇటీ️వల మున్సిపల్ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగయ్యపేట పురపాలక విజేతలు, పార్టీ నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలను అభినందించారు. కొన్ని నియోజకవరాల్లో సమర్థుల్ని ప్రోత్సహించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇకపై అలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ స్థానిక ఎన్నికలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రభుత్వ వైఫల్యాలను బలంగా జనంలోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. జనంతో మమేకమయ్యే నేతలకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామన్నారు.
జగ్గయ్యపేటలో డబ్బు, అధికార బలం, ప్రలోభాలతో వైకాపా గెలిచిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న వార్డుల్లోనూ రీకౌంటింగ్‌కు అవకాశం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అక్రమాలతో వైకాపా గెలిచినా... నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే అన్నారు. వైకాపా అక్రమాలను ఎదిరించి పోరాడారంటూ పార్టీ నాయకులను చంద్రబాబు అభినందించారు. ఇకపైనా అదే దూకుడు కొనసాగించాలన్నారు.
CBN WITH KONDAPALLI CADDER: నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.. మనమూ మారాలి..
CBN WITH KONDAPALLI TDP LEADERS: ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రజా కంఠకంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పోరాట పటిమతో పాటు పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంచేశారు.
CBN WITH KONDAPALLI TDP LEADERS
Last Updated : Dec 2, 2021, 4:32 AM IST