ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN ON FINANCIAL SURVEY: ఆర్థిక సర్వేలో ఏపీ స్థానం దిగజారడం బాధాకరం: చంద్రబాబు - విజయవాడ తాజా వార్తలు

CBN ON FINANCIAL SURVEY: ఆర్థిక సర్వే 2021-22లో ఏపీ స్థాయి దిగజారడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని ఇకనైనా సరిదిద్దాలని అన్నారు. ఈ విషయంపై సీఎం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

CBN ON FINANCIAL SURVEY
CBN ON FINANCIAL SURVEY

By

Published : Feb 1, 2022, 9:45 PM IST

CBN ON FINANCIAL SURVEY: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2021-22లో ఏపీ స్థానం దిగజారిపోవటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2019 వరకు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు చెత్త పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల సరసన నిలిచిందని మండిపడ్డారు.

గాడిలో పెట్టడానికి ఏళ్లు పడుతుంది..

రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక విధ్వంసం ఊహించలేనిదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆర్థిక పరిస్థితిని ఎలా నిర్వహించాలో తెలియని అసమర్థ వైకాపా ప్రభుత్వం సృష్టిస్తున్న వినాశకరమైన గందరగోళాన్ని తొలగించేందుకు.. భవిష్యత్తులో చాలా సంవత్సరాలు పడుతుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఇప్పటికే నాశనం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇంతకు మించి నాశనం చేయకుండా ఆర్థిక దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:Chandrababu on Budget: బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. రైతులకు ఎలాంటి మేలు జరగదు: చంద్రబాబు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details