గ్యాస్ లీకేజ్ ఘటనలోని బాధితులకు భరోసా ఇవ్వాలని.. తెదేపా నేతలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో చంద్రబాబు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వారి భవిష్యత్తు, ఆరోగ్యం కోసం సాయం చేద్దామని నేతలను కోరారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.
బాధితులకు భరోసానివ్వాలి: చంద్రబాబు - విశాఖ గ్యాస్ లీకేజ్ బాధిత కుటుంబాలకు చంద్రబాబు సంతాపం న్యూస్
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బాధితులకు భరోసా ఇవ్వాలని పార్టీ నేతలకు తెలిపారు.
chandrababu naidu about vishaka gas leakage victims