ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంస పాలనే కనిపిస్తోంది: చంద్రబాబు - Chandrababu News

Chandrababu News: రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. విధ్వంస పాలనే కనిపిస్తోందని తెదేపా ఆధినేత చంద్రబాబు అన్నారు. సొంత రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకురావాలని ఎన్​ఆర్​ఐలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు అందరూ తెదేపాకు అండగా ఉండాలని కోరారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : May 21, 2022, 10:34 PM IST

Chandrababu Fires on YSRCP: వైకాపా ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని.. విపరీతంగా ధరలు పెంచి 'బాదుడే బాదుడు' చేపట్టారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా కాకూడదని.. సొంత రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ తెదేపాకు అండగా ఉండాలని ఎన్​ఆర్​ఐలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెస్స్​లో చంద్రబాబు కోరారు. వైకాపా పాలనలో అమరావతి పూర్తిగా ధ్వంసమైందని.. అమరావతిలో 2 నుంచి 3 లక్షల కోట్లను నాశనం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక యువత చాలా ఆందోళనతో ఉందన్నారు.

వైకాపా ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా ధరలు పెంచి బాదుడే బాదుడు చేపట్టారు. ఎక్కడ చూసినా విధ్వంస పాలనే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా కాకూడదు. ఎన్‌ఆర్‌ఐలు అందరూ తెదేపాకు అండగా ఉండాలి. సొంత రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకురావాలి. పొరుగు రాష్ట్రాల వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఎలా ఇస్తారు?. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఏపీలో సమర్థులు లేరా?. రాష్ట్రంలో విద్యాసంస్థల అధినేతలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. నారాయణ సంస్థల్లో చదివి ఎంతోమంది ఉన్నతస్థితికి ఎదిగారు. -చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details