Daggubati at Apollo Hospital: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర ఛాతి నొప్పితో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోజ్ అగర్వాల్ ఆధ్వర్యంలోనై వైద్యుల బృందం దగ్గుబాటికి యాంజియోప్లాస్టి నిర్వహించి రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడుతున్నట్టు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం అపోలో ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత.. పరామర్శించిన చంద్రబాబు
Daggubati Venkateswara Rao: అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దగ్గుబాటిని పరామర్శించిన చంద్రబాబు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Chandrababu meet Daggubati Venkateswara Rao