ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్మికలోకానికి చంద్రబాబు 'మే'డే శుభాకాంక్షలు - కార్మికలోకానికి చంద్రబాబు మే డే శుభాకాంక్షలు తాజా వార్తలు

కార్మికలోకానికి చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ..అసమర్థ నిర్ణయాలతో లక్షలాది మంది భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులను రోడ్డున పడేసిందని ఆయన మండిపడ్డారు.

Chandrababu May Day wishes
కార్మికలోకానికి చంద్రబాబు మే డే శుభాకాంక్షలు

By

Published : Apr 30, 2021, 10:35 PM IST

కార్మికలోకానికి చంద్రబాబు 'మే'డే శుభాకాంక్షలు

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికలోకానికి తెదేపా అధినేత చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ వారి హక్కుల పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన వెల్లడించారు.

తెదేపా హయంలో కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయటంతో పాటు రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం ద్వారా భరోసా కల్పించామన్నారు. వందలాది పరిశ్రమలను నెలకొల్పేలా చేసి లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆకలితో కార్మికులు ఉండరాదనే అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ పథకాలన్నింటినీ జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా కష్టకాలంలో అనేక ఒడిదుడుకులను, గడ్డు పరిస్థితుల్లను ఎదుర్కొంటున్న కార్మికులకు తెదేపా బాసటగా నిలుస్తుందని భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details