ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా అక్రమాలను అడ్డుకోండి: ఎస్​ఈసీకి లేఖలో చంద్రబాబు - chandrababu letter to sec

వైకాపా అభ్యర్థులకు మద్దతుగా ఉండి పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు అరోపించారు. ఈ మేరకు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. అభ్యర్థులకు రెవెన్యూ అధికారులు ఎటువంటి సహకారం అందించడం లేదని.. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

cbn letter to sec
వైకాపా అక్రమాలను అడ్డుకోవాంటూ ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

By

Published : Feb 7, 2021, 11:02 PM IST

అధికార వైకాపా నేతలతో కలిసి పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల, పుంగనూరులో వైకాపా అభ్యర్థులకు మద్దతుగా ఉండి పోలీసులు ఇతర పార్టీల వారిని వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ఎటువంటి సహకారం అందించడం లేదని, కుల ధ్రువీకరణ, నో డ్యూస్ పత్రాలివ్వడం లేదని చెప్పారు.

ఈ విషయమై తక్షణమే స్పందించాలని లేఖలో కోరారు. నామినేషన్లకు ఇంక ఒక్కరోజే గడువుందని.. దీనిపై చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు సహకరించేలా ఆదేశాలివ్వాలన్నారు. శాంతియుతంగా నామినేషన్లు ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. గత మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుందన్నారు. ఇప్పుడు కూడా ఏకగ్రీవాల కోసం అరాచకాలకు తెరలేపారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details