ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేశారు...: చంద్రబాబు - cbn to sec

చిత్తూరులో వైకాపా ఫోర్జరీ సంతకాల వ్యవహారంపై ఎస్‌ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదన్న బాబు.. బలవంతపు ఉపసంహణలపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

cbn letter to sec
ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదు

By

Published : Mar 3, 2021, 8:20 PM IST

చిత్తూరులో వైకాపా శ్రేణులు నకిలీ, ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నామ పత్రాలను బలవంతంగా ఉపసంహరించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నామినేషన్ల ఉపసంహరణను వీడియో రికార్డింగ్ చేయాలని ఎన్నికలసంఘం ఇచ్చిన ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదని పేర్కొన్నారు. వైకాపా ఫోర్జరీ సంతకాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు.

వైకాపా నాయకులు, ఓ వర్గం అధికారులు, పోలీసులు కుమ్మకై తెదేపా నేతల ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరణకు పాల్పడ్డారని పేర్కొన్నారు. తెదేపా అభ్యర్థుల్లా నటించిన వైకాపా నాయకులు.. రిటర్నింగ్ అధికారులకు నకిలీ ఉపసంహరణ పత్రాలు అందచేశారని ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణలకు నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా ఈ తరహా అక్రమాలు కొనసాగాయని ఆక్షేపించారు. అసలు అభ్యర్థులకు తెలియకుండా జరిగిన ఈ ఉదంతాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో రికార్డింగ్, సమగ్ర విచారణ తర్వాతే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో ఏకగ్రీవాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పుర పోరు: పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం

ABOUT THE AUTHOR

...view details