CBN letter to CS Sameer sharma: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై.. ఎన్జీటీ ఆదేశాల అమలు కోరుతూ సీఎస్ సమీర్‌శర్మకు.. తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వేనెంబర్ 104, 213 లలో అక్రమ మైనింగ్‌పై.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను లేఖకు జతచేశారు. గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటి ఇచ్చిన అదేశాలను తక్షణమే అమలు చెేయాలని కోరారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్‌ను ఎన్జీటి నిర్థారించిందని లేఖలో పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలన్న ఎన్జీటీ ఆదేశాలను ప్రస్తావించిన చంద్రబాబు.., ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్‌పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న అదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని తెలిపారు.