ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరదలు, వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలి: చంద్రబాబు - వరదలపై చంద్రబాబు కామెంట్స్

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవటంపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరద, విపత్తుల వల్ల నష్టపోతున్న వివిధ వర్గాలను ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.

వరదలు, వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలి
వరదలు, వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలి

By

Published : Sep 28, 2020, 7:46 PM IST

రాష్ట్రంలో వరద, విపత్తుల వల్ల నష్టపోతున్న వివిధ వర్గాల ప్రజలను ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల వరద, భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజానికాన్ని ఆదుకోవటంపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. వరదల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు.., జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోళ్లు చేసి రైతుల్లో భరోసా నింపాలన్నారు.

గోదావరి ప్రాంతంలో భారీ వర్షాలు, కృష్ణా ప్రాంతంలో వరద పరిస్థితుల దృష్ట్యా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు వరదలు..,మరోవైపు కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details