ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN Letter to CS: విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ అవినీతి విధానాలే కారణం: చంద్రబాబు - సీఎస్ కు చంద్రబాబు లేఖ

CBN letter to CS: విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ అవినీతి విధానాలే కారణమని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు.

Chandrababu letter to Chief secretary sameer sharma
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు.. తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

By

Published : Apr 10, 2022, 9:00 AM IST

CBN letter to CS: రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు.. తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని.. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల పేరిటి తెచ్చిన రూ.26 వేల కోట్ల అప్పులు.. చార్జీల పెంపుతో వచ్చిన రూ. 16 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ అవినీతి విధానాలే కారణమని.. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని తెలిపారు. విద్యుత్‌ కోతలతో ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలు నష్టపోతున్నాయని.. పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని లేఖ ద్వారా వివరించారు. విద్యుత్ సంక్షోభంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు.. తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details